ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం మాఫీ అంటూ నకిలీ వార్త.. హైదరాబాద్ లో ఎగబడ్డ వాహనదారులు!
- సోషల్ మీడియాలో నకిలీ వార్తలు
- గోషామహల్ స్టేషన్ వద్దకు రావాలని సూచన
- తలలు పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు
తొలుత అసలు ఏం జరుగుతుందో అర్థం కాని ట్రాఫిక్ పోలీసులు, ఆ తర్వాత ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అని తేల్చేశారు. తాము ఎలాంటి లోక్ అదాలత్ నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. దీంతో వారంతా ఉసూరుమంటూ నిరాశగా వెనుదిరిగారు. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.