నేను మోదీ విధానాలకు వ్యతిరేకిని కానీ మోదీకి కాదు: చంద్రబాబు
- మొదటి నుంచి మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్నా
- గోద్రా అల్లర్ల సమయంలో రాజీనామా కోసం డిమాండ్ చేశా
- 29 సార్లు ఢిల్లీకి వెళ్తే కనీస మర్యాద కూడా ఇవ్వలేదు
బీజేపీతో చెలిమి ఎందుకు చేశారన్న రాజ్‌దీప్ ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. విభజన హామీలు నెరవేరుస్తారని, హోదా ఇస్తారనే నమ్మకంతోనే బీజేపీతో కలిసి 2014లో ముందుకెళ్లినట్టు వివరించారు. రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ 29 సార్లు తాను ఢిల్లీకి వెళ్లానని, అన్నిసార్లు వెళ్లినా తనకు కనీస మర్యాద ఇవ్వలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.