మరోసారి నిరాహారదీక్షకు సిద్ధమైన అన్నా హజారే
- జనవరి 30 నుంచి రాలేగావ్ సిద్ధిలో నిరాహారదీక్ష
- లోక్ పాల్, లోకాయుక్తలను నియమించాలని డిమాండ్
- కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు
ఇదే అంశంపై ఈ నెల ప్రారంభంలో అన్నా హజారే మాట్లాడుతూ, మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయిందని... కానీ, ఇంత వరకు లోక్ పాల్, లోకాయుక్తలను ఆయన నియమించలేదని మండిపడ్డారు. లోక్ పాల్, లోకాయుక్తలను నియమించాలన్న ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని దుయ్యబట్టారు.