ముంబై-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు షాక్.. బ్రేక్‌ఫాస్ట్‌గా కంపుకొట్టే ఆహారం!
- కాలం చెల్లిన ఆహార పదార్థాల సరఫరా
- ఐఆర్సీటీసీ తీరుపై ప్రయాణికుల ఆగ్రహం
- సికింద్రాబాద్‌లో ఫిర్యాదు
దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో కేటరింగ్ సర్వీస్ కోసం అదనంగా సూపర్ ఫాస్ట్ సర్ చార్జీ వసూలు చేస్తారు. బుధవారం రాత్రి లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ)లో రైలు ఎక్కిన ప్రయాణికులకు కేటరింగ్ సిబ్బంది గురువారం ఉదయం మురిగిపోయిన ఆహారం అందించారు. కొందరు ప్రయాణికులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఆన్ డ్యూటీ ఆఫీసర్‌కు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.