టీ-కాంగ్రెస్ ఎమ్మెల్సీల లేఖ ఆమోదం.. టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేస్తూ ప్రకటన!

  • ఈ రోజు ఉదయం మండలి చైర్మన్ కి లేఖ
  • ఈ లేఖను ఆమోదించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్
  • ఈ మేరకు శాసనమండలి సెక్రటరీ ప్రకటన 
టీ- కాంగ్రెస్ శాసన మండలి లెజిస్లేటివ్ పార్టీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖను మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆమోదించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, దామోదర్ రెడ్డి, సంతోష్, ప్రభాకర్ రావులు ఈ రోజు ఉదయం మండలి చైర్మన్ ని కలిసి ఓ లేఖ ఇచ్చారు. ఈ లేఖను స్వామిగౌడ్ ఆమోదించినట్టు శాసనమండలి సెక్రటరీ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, దామోదర్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరారు. నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ భేటీ అయిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
t-congress
trslp
swamy goud
aakula lalitha

More Telugu News