హెచ్-1బీ వీసాల దరఖాస్తులు పెరుగుతున్నాయి.. ఇకపై అత్యంత ప్రతిభావంతులకే!: అమెరికా అధికారులు
- ప్రతి ఏటా హెచ్ -1బీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది
- స్థానిక నియామకాలు మరింత పెంచాలనే ఈ నిర్ణయం
- అత్యంత ప్రతిభావంతులను తీసుకుంటే మేలు
ఈ సందర్భంగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టెన్ నీల్సన్ మాట్లాడుతూ, ప్రతి ఏటా హెచ్ -1బీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని, ఈ దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులను మాత్రమే తీసుకుంటే కంపెనీలకు మేలు జరుగుతుందని, పనిలో నాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తమ పౌరులు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలని, స్థానిక నియామకాల సంఖ్య మరింతగా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.