balakrishna: బాలయ్య నుంచి చిరంజీవికి అందని ఆహ్వానం?

  • ఈ సాయంత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్
  • పలువురు ప్రముఖులను ఆహ్వానించిన బాలయ్య
  • చిరంజీవిని ఆహ్వానించని  బాలయ్య

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ ఈ సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబులతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులను బాలయ్య స్వయంగా ఆహ్వానించారు. అయితే మెగాస్టార్ చిరంజీవిని మాత్రం ఈ వేడుకకు ఆహ్వానించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో చిరంజీవి పాత్ర ఉంటుందని అనుకున్నప్పటికీ... బాలయ్య ఆ పాత్రను పక్కన పెట్టారట. మరోవైపు, రాజకీయ కారణాల వల్లే చిరంజీవిని బాలయ్య ఆహ్వానించి ఉండకపోవచ్చని ఫిలింనగర్ టాక్. 

More Telugu News