ప్రభాస్ గెస్ట్ హౌస్ జప్తు వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!
- గత బుధవారం సీజ్ చేసిన అధికారులు
- గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూమిలో ఉందని వెల్లడి
- క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేశామన్న ప్రభాస్
ఈ సందర్భంగా ప్రభాస్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా ఈ భూమి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నామని కోర్టుకు తెలిపారు. ఇందుకోసం రూ. 1.05 కోట్ల ఫీజును కూడా చెల్లించామని వెల్లడించారు. ఈ దరఖాస్తు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు తమ భూమిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.