చిత్తూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
- చైనాకు చెందిన టీసీఎల్ కంపెనీకి శంకుస్థాపన
- రూ.2200 కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమ
- పాడిపేటలో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించనున్న సీఎం
తూర్పు మండలాల్లో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఇక్కడ టీసీఎల్ ఏర్పాటుకు చైనా ఆసక్తి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటైతే దాదాపు 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో బుధవారం రాత్రే టీసీఎల్ చైర్మన్ లిడాంగ్ షెన్, ఇతర ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయి చర్చలు జరిపారు.
ఇక టీసీఎల్‌కు శంకుస్థాపన అనంతరం సీఎం తిరుపతి రూరల్ మండలం పాడిపేటలో నిర్మిస్తున్న 3300 ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్లపత్రాలు అందిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటకు తిరిగి తిరుపతి చేరుకుంటారు.