Chandrababu: టీఆర్‌ఎస్‌కు, మోదీకి లొంగిపోయే వ్యక్తిని కాదు: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
తాను ప్రధాని నరేంద్రమోదీకి, టీఆర్ఎస్‌కు లొంగిపోయే వ్యక్తిని కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మోదీ విధానాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించిదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీయేతర కూటమిపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందన్నారు.

కాకినాడలో పెథాయ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిత్లీ తుపాను వచ్చినప్పుడు జిల్లాలోనే ఉండి బాధితులను పరామర్శించలేని వాళ్లు.. ఇప్పుడు తాను వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లానని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎక్కడున్నా తన మనసంతా ఇక్కడే ఉంటుందన్నారు. తానెక్కడున్నా అక్కడి నుంచే నిత్యం పర్యవేక్షిస్తుంటానని చెప్పారు. ప్రధాని పదవి గురించి అడిగిన ఓ ప్రశ్నకు చంద్రబాబు మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వాటి గురించి మాట్లాడడం సందర్భం కాదని చంద్రబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Kakinada
TRS
Narendra Modi
Pethai cyclone

More Telugu News