Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం: ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లోని సీడీఎంఏ కార్యాలయంలో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్లే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయని, డిసెంబర్ 31 తర్వాత పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, నిబంధనలకు లోబడే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు కూడా ప్రింట్ చేశామని, అసెంబ్లీ ఓటర్ల జాబితాను అనుసరించే ఈ ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలపై కొత్త సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా పంపించినట్టు చెప్పారు. 
Go Back to Shorts
Telangana
panchayati elections
election commissioner
nagi reddy

More Telugu News