kamal: 'భారతీయుడు 2’ కోసం ప్రాచీన యుద్ధవిద్యను నేర్చుకున్న కాజల్‌

  • 'భారతీయుడు2' కోసం శంకర్ కసరత్తు 
  • కమల్ సరసన నాయికగా కాజల్ 
  • జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్

శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'భారతీయుడు' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో సీనియర్ కమలహాసన్ తనపై దాడికి దిగినవారిపై ఒక ప్రాచీన యుద్ధ విద్యను ప్రయోగించి మట్టి కరిపిస్తుంటాడు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా రానున్న 'భారతీయుడు 2'లోను 'వర్మకళ' (తమిళంలో వర్మకలై) అనే ప్రాచీన యుద్ధకళను గురించిన సన్నివేశాలు వుంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ కనిపించనుంది. కథ ప్రకారం ఈ సినిమాలో కాజల్ కూడా 'వర్మకళ'ను ప్రయోగించే సన్నివేశాలు వున్నాయట. ఈ కారణంగా ఈ ప్రాచీన యుద్ధకళను కాజల్ కూడా నేర్చేసుకుందట. కాజల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చాలా త్వరగానే ఈ యుద్ధవిద్యను నేర్చుకుందని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. 

More Telugu News