కేటీఆర్ తో కలిసి పనిచేస్తా.. పార్టీలో నేతలందరూ సంతోషంగా ఉన్నారు!: హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్ తో కలిసి పనిచేస్తా.. పార్టీలో నేతలందరూ సంతోషంగా ఉన్నారు!: హరీశ్ రావు

  • తెలంగాణభవన్ కు చేరుకున్న నేతలు
  • కేశవరావు, హరీశ్ లను కలుసుకున్న కేటీఆర్
  • తెలంగాణ కోసం కలిసి పనిచేస్తామన్న హరీశ్
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తొలుత తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కేటీఆర్ లోపలకు వెళ్లారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ బావ హరీశ్ రావు, సీనియర్ నేత కె.కేశవరావులను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా హరీశ్ సహా పలువురు నేతలు కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నియామకం పట్ల పార్టీ నాయకులందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పునర్ నిర్మాణంపై కేటీఆర్ దృష్టి సారిస్తారని వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
KTR
KCR
Harish Rao
TRS
KESAVARAO

More Telugu News