కారు యాక్సిడెంటులో చనిపోయిన స్కూటరిస్ట్.. హీరోయిన్ జరీన్ ఖాన్ పై కేసు నమోదు!
- గోవా రాజధాని పనాజీలో రోడ్డు ప్రమాదం
- హీరోయిన్ జరీన్ ఖాన్ కారు ఢీకొని యువకుడి దుర్మరణం
- పోలీసులను ఆశ్రయించిన మృతుడి సోదరుడు
జరీన్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, తన ఎంజాయ్ మెంట్ కోసం కారును వేగంగా పోనిచ్చిందని ఆరోపించాడు. డ్రైవర్ ఇష్టానుసారంగా వేగంగా వాహనాన్ని నడుపుతున్నా, కనీసం అతడిని వారించే ప్రయత్నం చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు విశాల్ ఫిర్యాదుతో పనాజీ పోలీసులు జరీన్, ఆమె డ్రైవర్ అబ్బాస్ పై కేసు నమోదు చేశారు. వారిద్దరి నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. సల్మాన్ ఖాన్‌కు జోడీగా ‘వీర్’ సినిమాతో బాలీవుడ్ లో జరీన్ అరంగ్రేటం చేసింది. ‘హౌస్‌ఫుల్ 2’, ‘హేట్‌స్టోరీ 3’, ‘అక్సర్ 2’ తదితర సినిమాల్లో జరీన్ నటించి మెప్పించింది.