అపవిత్ర కూటమిని తిరస్కరించారు: టీఆర్ఎస్ విజయంపై జగన్ ట్వీట్
- ట్విట్టర్ ద్వారా స్పందించిన జగన్
- కేసీఆర్ గారికి శుభాకాంక్షలు
- ప్రభుత్వంపై నమ్మకంతో మరోసారి గెలిపించారు
కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘‘కేసీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతరుల అపవిత్ర కూటమిని ప్రజలు తిరస్కరించారు’’ అని జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.