Australia: భారత్-ఆసీస్ మధ్య దోబూచులాడుతున్న విజయం.. ఉత్కంఠగా తొలి టెస్ట్

  • విజయానికి మూడు వికెట్ల దూరంలో భారత్
  • ఆసీస్ విజయానికి 121 పరుగులు అవసరం
  • అభిమానుల్లో ఉత్కంఠ

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. చివరి రోజు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడుతోంది. ఓవర్ నైట్ స్కోరు 104/4తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో 11 పరుగులు చేసి ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో మరింత పట్టుబిగించిన భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మరోవైపు పరాజయాన్ని అడ్డుకునేందుకు కంగారూ బ్యాట్స్‌మెన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సహచరులు వెనుదిరుగుతున్నా షాన్ మార్ష్ ఒంటరి పోరాటం చేశాడు. భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన మార్ష్ (60) ను ఎట్టకేలకు బుమ్రా పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ విజయంపై ఆశలు చిగురించాయి.

 బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న కెప్టెన్ టిమ్ పైనే (41) ను లంచ్ తర్వాత బుమ్రా అవుట్ చేయడంతో భారత విజయం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత్ విజయానికి మూడు వికెట్లు అవసరం కాగా, ఆసీస్ విజయం సాధించాలంటే 121 పరుగులు అవసరం. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, షమీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మకు ఓ వికెట్ దక్కింది.

More Telugu News