ఏడుకొండలూ దిగి వచ్చిన శ్రీవారి కాసుల హారం... వైభవంగా ఊరేగింపు!
- తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
- నేడు గజవాహన సేవ
- అమ్మకు అలంకరణలో స్వామి వారి హారం
తిరుమాడ వీధుల్లో ఊరేగింపు అనంతరం తిరుమల నుంచి తిరుచానూరుకు హారాన్ని తరలించారు. నేటి సాయంత్రం పద్మావతీ దేవికి జరిగే గజ వాహన సేవ సమయంలో ఈ హారాన్ని అలంకరిస్తారు. తిరుమలలో గరుడోత్సవానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, తిరుచానూరులో గజవాహన సేవకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి, అమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ.