అవును.. పవన్ కల్యాణ్ కు నిజంగానే తిక్క ఉంది!: కాలువ శ్రీనివాసులు
- ఉదయం చెప్పింది సాయంత్రానికి మర్చిపోతారు
- ప్రత్యేక హోదా పోరాటంపై ఆయన మాటతప్పారు
- అనంతపురంలో గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేస్తానని జనసేనాని ప్రకటించారని గుర్తుచేశారు. కానీ కేంద్రం హోదా ఇవ్వకపోయినా పవన్ కల్యాణ్ నోరు మెదపలేదని విమర్శించారు. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మరోసారి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా రైతు నీరుగంటి సెంటన్న రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేశారు.