సీబీఐ చీఫ్ పై ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు సీవీసీని ఎందుకు సంప్రదించలేదు?: కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- అలోక్ వర్మ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు
- ఉన్నపళంగా వాళ్లిద్దరినీ సెలవుపై ఎలా పంపించారు?
- ఈ పరిణామాలు రాత్రికి రాత్రే జరగలేదన్న సుప్రీంకోర్టు
గత జులై నుంచి వాళ్లని భరిస్తున్నామని చెప్పారు కదా, మరి, అకస్మాత్తుగా వారిని సెలవుపై ఎందుకు పంపించాల్సి వచ్చిందని, సీబీఐ చీఫ్ పై ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు సీవీసీని ఎందుకు సంప్రదించలేదని సుప్రీం ప్రశ్నించింది. కాగా, సీబీఐ కేసుల దర్యాప్తునకు బదులుగా వారే ఒకరిపై ఒకరు దర్యాప్తు చేసుకుంటున్నారని సుప్రీంకోర్టుకు సీవీసీ వెల్లడించింది. సీబీఐ అంశంపై తాము దర్యాప్తు చేపట్టామని, అయితే, కొన్ని నెలలుగా సంబంధిత దస్త్రాలను అలోక్ వర్మ తమకు ఇవ్వలేదని కోర్టుకు సీవీసీ తెలిపింది.