మహేశ్ బాబు అడుగుజాడల్లో అల్లు అర్జున్.. సత్యం థియేటర్ పై కన్నేసిన స్టైలిష్ స్టార్!
- ఏఎంబీ సినిమాస్ ప్రారంభించిన మహేశ్
- మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగనున్న బన్నీ
- సంబంధిత వర్గాలతో కొనసాగుతున్న చర్చలు
అమీర్ పేట వద్ద ఉన్న సత్యం థియేటర్ స్థానంలో మల్టిప్లెక్స్ కట్టేందుకు బన్నీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ లోనూ మల్టిప్లెక్స్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించాయి. అయితే ఈ విషయమై అల్లు అర్జున్, ఆయన టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఇంకా త్రివిక్రమ్, బన్నీ స్పందించలేదు.