తెలంగాణలో ఎన్నికల వేళ పారుతున్న ‘ధన ప్రవాహం’.. ఆలేరులో రూ.13.3 లక్షలు స్వాధీనం
- చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడిన నోట్ల కట్టలు
- టాటా ఏస్ వాహనంలో అట్టపెట్టె ద్వారా నగదు రవాణా
- నిందితుడిని విచారిస్తున్న పోలీసులు
చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మినీ రవాణా వాహనం వచ్చింది. పోలీసులు అందులోని అట్టపెట్టెలను నిశితంగా పరిశీలించారు. ఓ పెట్టెలో నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి తొర్రూరుకు ఈ నగదును తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు.