నలుగురు ప్రత్యర్థి నేతలు, రూ. 11 కోట్లకు డీల్... ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించిన రంగారెడ్డి జిల్లా నేత!

మన ఓట్లు మనకు పడతాయి... పక్క పార్టీ ఓట్లు లాగితే గెలుపు ఖాయమవుతుందన్న ఆలోచనలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేత తన వద్ద ఉన్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించి, నలుగురు ప్రత్యర్థి పార్టీ నేతలను రూ. 11 కోట్లతో కొనేసినట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది.

ఆ పార్టీల్లోనే ఉండి తనకు సహకరించేలా ఒప్పందం కుదుర్చుకున్న నేత, ఒకరికి రూ. 4 కోట్లు, మరో ఇద్దరికి రూ. 2 కోట్ల చొప్పున, ఇంకొకరికి రూ. 3 కోట్లు చేరవేసినట్టు సమాచారం. ఈ ముగ్గురూ సదరు నేత విజయానికి తమవంతు సహకారాన్ని అందించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించేశారట.

ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఓ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్ ఓటును రూ. 3 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 9 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండటంతో, వాటిల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లను తాను సంపాదించాలని టార్గెట్ గా పెట్టుకున్న సదరు నేత, డబ్బులు వెదజల్లుతున్నారని తెలుస్తోంది.
Go Back to Shorts
Ranga Reddy District
Leader
Opposition

More Telugu News