T news: నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానల్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల ఫిర్యాదు

షార్ట్స్‌లో చూడండి
నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానల్‌పై టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఈ రెండు మాధ్యమాల్లోనూ వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న ఈ రెండింటిలోనూ కేటీఆర్ డైరెక్టర్‌గా ఉన్నారన్నారు. టీఆర్ఎస్‌కు అనుకూలంగా పత్రిక, చానల్‌లో వార్తలను ప్రసారం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా నవంబరు 26వ తేదీనాటి నమస్తే తెలంగాణ పత్రికను ఫిర్యాదుకు జత చేశారు. ఆ రోజు పేపర్లోని వార్తల్లో 95 శాతం టీఆర్ఎస్‌కు కేటాయించినట్టు కనకమేడల పేర్కొన్నారు.

హేతుబద్ధత లేని సర్వేలను ప్రచురించడమే కాకుండా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పార్టీల నేతల ప్రతిష్ఠకు భంగం కలిగేలా వార్తలను ప్రచురిస్తున్నారని/ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వార్తలను ప్రచారం చేస్తున్న ఈ రెండింటిపైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కనకమేడల కోరారు.
Go Back to Shorts
T news
Namasthe Telangana
Kanakamedala
Telugudesam
EC

More Telugu News