విజయ్ గెలుపు ఓకే... హామీల అమలే అసలు సమస్య!
- పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచిన విజయ్
- ఇచ్చిన హామీల అమలకు రూ. లక్ష కోట్లు అవసరమని అంచనా
- మహిళల సాయం, ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపుతో ఖజానాపై భారీ వ్యయం
- రాష్ట్రంపై ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు
- నిధుల సమీకరణపై అధికారుల్లో సందేహాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి అసలైన సవాల్ ఇప్పుడు ఎదురుకానుంది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. ఈ హామీలన్నింటినీ అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై అదనంగా దాదాపు రూ. లక్ష కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వీటి అమలు అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీవీకే మేనిఫెస్టోలోని ప్రధాన హామీలను పరిశీలిస్తే, మహిళలకు నెలవారీ సాయాన్ని రూ. 1,000 నుంచి రూ. 2,500కు పెంచనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 21,618 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం ఇస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాలన్న హామీతో రూ. 4,248 కోట్లు, వృద్ధాప్య పింఛను రూ. 2,000కు పెంచడంతో రూ. 1,581 కోట్ల అదనపు వ్యయం కానుంది. వీటితో పాటు వితంతు, దివ్యాంగుల పింఛన్ల పెంపు కూడా ఖజానాపై భారాన్ని పెంచనుంది.
ఏటా 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి రూ. 7,074 కోట్లు, రైతులకు ఏటా రూ. 15,000 సాయానికి రూ. 1,941 కోట్లు అవసరమవుతాయి. నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్టైపెండ్, మత్స్యకారులకు సాయం, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం (OPS) పరిశీలన వంటి హామీలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం రూ. 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. ఏటా లోటు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న తరుణంలో ఈ కొత్త హామీలకు నిధులు ఎలా సమకూరుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో, కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విజయ్ ఈ ఆర్థిక సవాళ్లను ఎలా అధిగమిస్తారన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.