నేను బతికే ఉన్నా.. డమ్మీని కాదు: బుహారి
- గుర్తు తెలియని వ్యాధికి చికిత్స
- బుహారి చనిపోయారని వదంతులు
- పట్టించుకోని బుహారి దంపతులు
అయితే బుహారి దంపతులు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు పోలండ్ వెళ్లిన బుహారి ప్రవాస నైజీరియన్లను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఓ కార్యక్రమానికి వెళ్లగా అక్కడి అతిథులు ఆయనను వదంతుల విషయమై ప్రశ్నించారు. దీంతో ఆయన తాను బతికే ఉన్నానని.. డమ్మీని కానని చెప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది బుహారి అధ్యక్ష పదవికి తిరిగి పోటీ చేయాలని భావిస్తుండటంతో ప్రత్యర్థులు ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేశారని తెలుస్తోంది.