కాంగ్రెస్ కు నాయకుడు లేడు, విధానాలు లేవు: అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ కు నాయకుడు లేడు, విధానాలు లేవు: అమిత్ షా

  • కాంగ్రెస్ నాయకుడు ఎవరని రాహుల్ ని చాలాసార్లు అడిగా
  • దేశ భద్రతతో కూడా కాంగ్రెస్ ఆడుకుంటోంది
  • సర్జికల్ దాడులను కూడా రాజకీయం చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో చెప్పాలని రాహుల్ గాంధీని చాలాసార్లు ప్రశ్నించినా... ఆయన సమాధానం చెప్పలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేడని, సరైన విధివిధానాలు కూడా లేవని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ భద్రతతో కూడా ఆడుకుంటోందని విమర్శించారు. సైనికులు జరిపిన సర్జికల్ దాడులను కూడా రాజకీయం చేస్తోందని అన్నారు. రాహుల్ కు మోదీ భయం పట్టుకుందని చెప్పారు. ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చినా... మోదీ హఠావో అంటోందని దుయ్యబట్టారు. రాజస్థాన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు.
amit shah
Rahul Gandhi
congress
bjp

More Telugu News