ఒకే కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయింది!: టీజేఎస్ అధినేత కోదండరామ్
- తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరో తెచ్చిపెట్టింది కాదు
- ఓ కుటుంబం కోసం ఈ రాష్ట్రాన్ని ఇవ్వలేదు
- తెలంగాణలో నియంతపాలన అంతం కావాలి
తాండూరు ఇప్పటికీ అభివృద్ధి కాలేదన్న కోదండరామ్, తమ కూటమి అధికారంలోకొస్తే జిల్లా కూర్పులు, జోన్ల కూర్పులు చేస్తామని చెప్పారు. జోన్ మార్పు కోసం వికారాబాద్ ప్రజలు చేస్తున్న పోరాటాన్ని పరిశీలిస్తామని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.