ఆసక్తిని రేకెత్తిస్తోన్న కల్యాణ్ రామ్ న్యూ మూవీ టైటిల్ లోగో
- గుహన్ దర్శకత్వంలో 118
- నాయికలుగా నివేదా .. షాలిని
- జనవరిలో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ టైటిల్ లోగోను ఈ రోజున రిలీజ్ చేశారు. సినిమాపై కుతూహలాన్ని పెంచేలా ఈ టైటిల్ లోగోను డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కథానాయికలుగా నివేదా థామస్ .. షాలిని పాండే నటించారు. జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే కల్యాణ్ రామ్ నమ్మకం ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.