ఇవాళ డిక్లేర్ చేస్తున్నా.. కచ్చితంగా వంద సీట్లకు పైగా టీఆర్ఎస్ గెలుస్తుంది: సీఎం కేసీఆర్
- చంద్రబాబు, ఓ మీడియా సంస్థ, కాంగ్రెస్ నేతల కుట్ర
- రేపో, ఎల్లుండో ఒక డూప్లికేట్ సర్వే వెలువరిస్తారు
- టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది
‘కేసీఆర్ గా నేను ఇవాళ డిక్లేర్ చేస్తున్నా. కచ్చితంగా వంద సీట్లు పైచిలుకుతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ తీర్పు అయితే వచ్చిందో.. జంటనగరాల్లో కూడా అదే తీర్పు రిపీట్ కాబోతోంది. ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు’ అని ధీమా వ్యక్తం చేశారు.