వైఎస్ జగన్ ను కలిసిన తెలంగాణ బీజేపీ నేత.. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి!
- హైదరాబాద్ లో నంబూరి రామలింగేశ్వరరావు భేటీ
- సత్తుపల్లిలో బీజేపీ టికెట్ పై పోటీచేస్తున్న నేత
- వైసీపీ కేడర్ మద్దతు కోసం జగన్ తో సమావేశం
సత్తుపల్లిలో వైసీపీ శ్రేణులు ఉన్నందున ఆ పార్టీ అధినేతను కలిసి మద్దతును కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈసారి సత్తుపల్లిలో బీజేపీ తరఫున తాను ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.