‘మహాదేవ్’ నటుడు మోహిత్ రైనా కు తీవ్ర గాయం.. కంటికి కుట్లు వేసిన వైద్యులు!
- షూటింగ్ సందర్భంగా గాయపడ్డ నటుడు
- ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఘటన
- తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించిన రైనా
ఈ విషయమై మోహిత్ రైనా మాట్లాడుతూ ‘మలీహాబాద్ ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తుండగా నేను గాయపడ్డాను. నా కంటికి గాయమైంది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చేరుకున్నాం. నన్ను పరీక్షించిన వైద్యులు, కంటి పైభాగంలో కుట్లు వేశారు. దేవుడి దయ వల్ల నా చూపు నిలిచింది. ఒక రోజు విశ్రాంతి తీసుకున్న తరువాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నాను’ అని తెలిపాడు.