డిసెంబ‌ర్ 31 సాయంత్రం 5:55కు లాస్‌ ఏంజెల్స్‌లో నా పెళ్లి: రాఖీ సావంత్

  • దీపక్ కలాల్ ను పెళ్లి చేసుకోనున్నా
  • పెళ్లికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది
  • శుభలేఖను పోస్టు చేసిన రాఖీ
'మీటూ' ఉద్యమానికి ఓ ఊపు తెచ్చిన తనుశ్రీ దత్తాపై విమర్శలతోను, ఆపై ఓ రెజ్లర్ ను సవాల్ చేసి తీవ్ర గాయాల పాలై మీడియాలో నిలిచిన రాఖీ సావంత్, ఇప్పుడు తన పెళ్లి వార్తను చెప్పి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 'ఇండియా గాట్ టాలెంట్' నటుడు దీప‌క్ క‌లాల్‌ తో తన వివాహం డిసెంబ‌ర్ 31న సాయంత్రం 5:55 కు లాస్ ఏంజిల్స్ లో జరుగుతుందని తెలుపుతూ, త‌న పెళ్లి శుభలేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

"ఇండస్ట్రీలో చాలా జంటలు ఒకటవుతున్నాయి. నాకు కూడా ఇదే సరైన సమయం అనిపించింది. మాకు మీ అందరి ఆశీర్వాదం కావాలి" అని రాఖీ సావంత్‌ కోరింది. కాగా, గతంలో కూడా పబ్లిసిటీ కోసం పలుమార్లు అబద్ధాలు చెప్పిన రాఖీ, పెళ్లి విషయంలో నిజం చెబుతుందని నమ్మేదెలా? అంటూ సగటు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Go Back to Shorts
Rakhi Sawant
Marriage
Wedding Card

More Telugu News