తెలంగాణలో రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్: ఈసీ ఆదేశాలు
- డిసెంబర్ 5 సాయంత్రం 6 గంటలకు మూత
- తిరిగి 7వ తేదీ సాయంత్రం 6 తరువాత తెరచుకోనున్న దుకాణాలు
- బార్లు, పబ్బులు, క్లబ్బులు కూడా మూత
మద్యం దుకాణాలతో పాటు అన్ని బార్లు, బార్లతో కలిసుండే రెస్టారెంట్ లు, పబ్ లు, స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ లు మూసివేయాలని, మిలటరీ క్యాంటీన్లలో మద్యం అమ్మకాలు జరుపవద్దని ఆదేశించారు. కాగా, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నలుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడటాన్ని నిషేధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.