ముంబైలో రికార్డులు బద్దలు కొడుతున్న రజనీకాంత్ ‘2.0’ సినిమా టికెట్ ధరలు!
- శుక్రవారం ప్రేక్షకుల ముందుకు ‘2.0’
- ఓ రేంజ్‌లో అమ్ముడుపోతున్న టికెట్లు
- రూ.1550 అయినా హాట్ కేక్‌లుగా మారిన వైనం
టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ల ప్రకారం.. కనీస టికెట్ ధర రూ. 118 కాగా, గరిష్ట ధర రూ.1550. ముంబైలో అత్యధిక ధరకు అమ్ముడుపోతున్న టికెట్లు ఇవే కావడం గమనార్హం. రెండు థియేటర్లు ఈ టికెట్లను విక్రయిస్తుండగా ఓ థియేటర్‌లో బుకింగ్ ఇప్పటికే ముగిసింది. రూ.1550 అయినా క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇక ముంబై తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంది. దేశ రాజధానిలో రూ.1450కి టికెట్లు విక్రయిస్తున్నారు. రూ.1030 ధరతో కోల్‌కతా మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూరు, చండీగఢ్, పూణె నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా టికెట్లను విక్రయిస్తున్నారు.