mangalore: మంగళూరు బీచ్‌లో మిట్ట మధ్యాహ్నం యువతిపై సామూహిక అత్యాచారం

  • తోటెబెంగ్రె బీచ్‌లో దారుణం
  • ప్రియుడిని కొట్టి యువతిపై అత్యాచారం
  • ఆరుగురి అరెస్ట్
కర్ణాటకలోని మంగళూరులో పట్టపగలే దారుణం జరిగింది. తోటెబెంగ్రె బీచ్‌లో ఓ యువతిని ఏడుగురు యువకులు చెరబట్టారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మంగళూరును కుదిపేస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువతి (21) అదే కంపెనీలో పనిచేస్తున్న ప్రియుడితో కలిసి ఈ నెల 18న తోటెబెంగ్రె బీచ్‌కు వెళ్లింది.

వారు సేద తీరుతున్న సమయంలో అక్కడే ఉన్న యువకుల దృష్టి ఆమెపై పడింది. అందరూ కలిసి ప్రియుడిని కొట్టి ఆమెను సమీపంలోని నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఏడుగురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం రాత్రి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
mangalore
Karnataka
tote bengre
Gang rape
Bengaluru

More Telugu News