జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి, రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ అరెస్ట్
- యూసుఫ్‌గూడలో ఉద్రిక్తత
- ఓ హత్యకేసులో పోలీసుల అదుపులోకి చిన్న శ్రీశైలం యాదవ్
- తన ప్రచారాన్ని అడ్డుకునే కుట్రన్న నవీన్ యాదవ్
విషయం తెలిసిన ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు సమీపంలోని శ్రీశైలం ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చిన్న శ్రీశైలం యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. తన తండ్రిని అదుపులోకి తీసుకోవడంపై నవీన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే పోలీసులు కుట్ర చేసి ఈ పనిచేశారని ఆరోపించారు.