నాడు కేటీఆర్‌తో, నేడు కేసీఆర్‌తో.. బీజేపీ అభ్యర్థి ఆకుల విజయ ఢీ!

  • పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ
  • గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేసి మూడో స్థానం
  • ఈసారి గజ్వేల్‌ నుంచి బరిలో
తెలంగాణ ముందస్తు ఎన్నికల బరిలో తలపడుతున్న బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. వరుస ఎన్నికల్లో తండ్రీకొడుకులపై పోటీ చేసిన ఘనత దక్కించుకుంటున్నారు. రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో విజయ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పట్లో అమె ప్రత్యర్థి, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌. ఈ ఎన్నికల్లో దీటైన పోటీ ఇచ్చిన విజయ మొత్తం 14,494 ఓట్లు దక్కించుకుని మూడో స్థానంలో నిలిచారు. ఈసారి గజ్వేల్‌కు మారారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తో తలపడుతున్నారు. ఈసారి ఆమె ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Go Back to Shorts
TRS
BJP
KCR
KTR
Akula vijaya

More Telugu News