పైరవీలు, సిఫారసులు అనే మాట లేకుండా అంతా ఆన్‌లైన్ చేశాం.. అందుకే లక్ష్యం లక్షలు దాటింది: చంద్రబాబు
- 'ముఖ్యమంత్రి యువనేస్తం' రికార్డు సృష్టించింది
- ఈ కార్యక్రమం అమలులో అనేక జాగ్రత్తలు తీసుకున్నాం
- 4 లక్షల మందికి పైగా ముఖ్యమంత్రి యువనేస్తాలయ్యారు
- డిసెంబర్ 1 నుంచి నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తాం
ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం అమలులో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, ఫలితంగా ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 4 లక్షల మందికి పైగా ముఖ్యమంత్రి యువనేస్తాలయ్యారని, వీరందరికీ డిసెంబర్ 1 నుంచి నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తామని చంద్రబాబు తెలిపారు. పైరవీలు, సిఫారసులు అనే మాట లేకుండా అంతా ఆన్‌లైన్ చేశామని, అందుకే లక్ష్యం లక్షలు దాటిందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. నిరుద్యోగభృతి అందుకుంటూనే, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన యువత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కానుందని చంద్రబాబు తన ధీమా వ్యక్తం చేశారు.