బాబా పిలుపుతోనే నేను ఇక్కడకు వచ్చా: చంద్రబాబు
Add ap7am to your home Screen

బాబా పిలుపుతోనే నేను ఇక్కడకు వచ్చా: చంద్రబాబు

  • సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
  • బాబాతో తనకున్న అనుబంధం అపురూపమైనదన్న సీఎం
  • సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలనిపిస్తుందన్న చంద్రబాబు
పుట్టపర్తిలో నిర్వహిస్తున్న సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్లో ఉన్న బాబా మహాసమాధిని ఆయన దర్శించుకున్నారు. బాబా 92వ జయంతిని పురస్కరించుకుని భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాబాతో తనకున్న అనుబంధం అపురూపమైనదని చెప్పారు. పుట్టపర్తి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమని... ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికి మనశ్శాంతితో పాటు, సమస్యకు సమాధానం దొరుకుతుందని తెలిపారు.

మానవసేవయే మాధవసేవ అని ప్రపంచానికి బాబా చాటిచెప్పారని చంద్రబాబు అన్నారు. బాబా చెప్పిన సూక్తులను, మార్గాలను పాటిస్తే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పారు. బాబా అనుగ్రహం ఉంటేనే ఇక్కడకు రాగలమని, ఆయన పిలుపుతోనే తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలని తనకు అనిపిస్తుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమా, జవహర్, శిద్దా రాఘవరావు, ప్రభుత్వ చీఫ్ విప్ లు పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డిలు కూడా హాజరయ్యారు. 
Chandrababu
puttaparthi
satya saibaba
jayanthi

More Telugu News