Revanth Reddy: దమ్ముంటే లోక్‌సభ ఎన్నికల్లో నాతో పోటీ చెయ్!: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

షార్ట్స్‌లో చూడండి
కేటీఆర్ ఆర్థిక నేరగాడని.. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని.. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి.. పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తనకు సవాల్ విసిరేందుకు కేటీఆర్ ఓనర్ కాదని.. పనోడని విమర్శించారు. దమ్ముంటే లోక్‌సభ ఎన్నికల్లో తనతో పోటీకి రావాలని సవాల్ విసిరారు.

గతంలో కేసీఆర్ పోటీ చేసిన మహబూబ్‌‌నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేద్దామని.. చేతనైతే తన సవాల్ స్వీకరించాలని రేవంత్ కోరారు. ఎన్నికల్లో ఓడితే కేటీఆర్ అమెరికాకు.. కేసీఆర్ ఇంటికి పోతానంటున్నారు. అయితే అధికారం లేకుంటే ప్రజలకు సేవ చేయరా? అని ప్రశ్నించారు. మరికొందరు టీఆర్ఎస్ ఎంపీలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఎంపీలే కాదు.. ఎమ్మెల్సీలు వస్తారన్నారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ ఆపుకోవాలని సవాల్ విసిరారు.
Go Back to Shorts
Revanth Reddy
KCR
KTR
Mahaboob Nagar

More Telugu News