కోడికత్తితో ఇప్పటికే పరువు పోగొట్టుకున్నారు.. మిగిలిన పరువునైనా కాపాడుకోండి: యరపతినేని
- కోడికత్తి దాడితో మాకు సంబంధం ఏమిటి?
- ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమే
- వైసీపీపై మండిపడ్డ యరపతినేని
ఈనెల 23న మంత్రి నారా లోకేష్ గురజాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రెంటచింతలలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని చెప్పారు. ఈ సమావేశానికి మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, టీడీపీ మండలాధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, ఎంపీపీ జీజాతుల నాయక్ తదితరులు హాజరయ్యారు.