రోడ్డెక్కిన వందలాది మంది... పారికర్ రాజీనామాకు డెడ్ లైన్!
- సీఎం పారికర్ కు అనారోగ్యం
- గోవాలో కుంటుపడిన పాలన
- ప్రజలు, విపక్షాల భారీ ర్యాలీ
"పీపుల్స్ మార్చ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ గవర్నెన్స్" పేరిట ర్యాలీ సాగింది. ఎన్సీపీ, శివసేన తదితర పార్టీలు ఈ ర్యాలీకి మద్దతు పలకడం, పలు ఎన్జీవో సంస్థలు, సామాజిక కార్యకర్తలు హాజరు కావడంతో ర్యాలీ విజయవంతమైంది. కాగా, పారికర్ అనారోగ్యంతో ఉండి ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఏడాదిగా గోవా రాష్ట్రంలో పరిపాలన కుంటు పడిందన్నది విపక్షాల అభియోగం