రెండున్నర గంటలలోనే ముగిసిపోయే '2.0'!
- '2.ఓ' సెన్సారింగ్ పూర్తి
- ఎటువంటి కట్స్ చెప్పని సెన్సార్ బోర్డు
- కొన్ని పదాలను మ్యూట్ చేయాలని సూచన
ఇక ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా నిడివి రెండున్నర గంటలు కూడా లేదట. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 2.28.52 సెకన్ల చిత్రమిది. సినిమాకు ఎటువంటి కట్స్ చెప్పని సెన్సార్ బోర్డు, కొన్ని పదాలను మాత్రం పైకి వినిపించకుండా చేయాలని సూచించిందని తెలుస్తోంది. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'జెంటిల్ మన్', 'భారతీయుడు', 'అపరిచితుడు', 'రోబో’లతో పోలిస్తే, '2.ఓ' నిడివి తక్కువ కావడం గమనార్హం.