'మీటూ' దెబ్బా... మజాకా?: నిబంధనలు మారుస్తున్న కార్పొరేట్లు!
- ఆఫీసుల్లో రొమాన్స్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు
- నిబంధనలను మార్చిన 78 శాతం కంపెనీలు
- ఓ అధ్యయనంలో వెల్లడి
ఆఫీసుల్లో ఎవరూ రొమాన్స్ చేయడానికి వీల్లేదని దాదాపు అన్ని కంపెనీలూ ఆంక్షలు విధించాయి. యూకేలో 20 కార్పొరేట్ సంస్థలు ఇటువంటి వ్యవహారాలపై పూర్తిగా నిషేధం విధించగా, 78 శాతం కంపెనీలు ఉద్యోగుల మధ్య ఉండాల్సిన సంబంధాల విషయంలో ఉన్న పూర్వపు నియమ నిబంధనలను సమీక్షించి, వాటిలో మార్పులను సూచించాయి.
కాగా, 'మీటూ' ఉద్యమం తీవ్రతరమైన తరువాత, ఎంతో మంది సెలబ్రిటీలు, ప్రముఖులు చీకట్లో సాగించిన కామ కలాపాలను, పలువురు మహిళలు వెలుగులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతుండటంతోనే పరిస్థితిలో మార్పు కనిపిస్తోందని ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది.