భారత ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు ప్రభావంపై ఆడిటింగ్ జరుపుతున్న కాగ్
- పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కంటే ముందే రానున్న నివేదిక
- నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టకపోయే అవకాశం
- ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం లేదు
నోట్ల రద్దుకు సంబంధించిన నివేదికను పూర్తి చేయడంలో కాగ్ కావాలనే అలసత్వం ప్రదర్శిస్తోందని గత వారం 60 మంది రిటైర్డ్ సీనియర్ అధికారులు కాగ్ కు లేఖ రాశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదనే భావనతోనే ఇలా చేస్తోందని లేఖలో అసహనం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు.