డ్యాన్స్ పేరిట వెళ్లి వ్యభిచారం... కెన్యాలో పట్టుబడ్డ డ్యాన్సర్.. బాలీవుడ్ నృత్య దర్శకురాలి ఆధ్వర్యం!
- నృత్య ప్రదర్శనల పేరిట విదేశాలకు
- అక్కడ వ్యభిచారం చేయాలని ఒత్తిడి
- కెన్యాలో బట్టబయలైన దందా
ఇటీవల కెన్యాలోని ఓ హోటల్ లో నృత్య ప్రదర్శనకు వచ్చిన యువతి వ్యభిచారం చేస్తుంటే, పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడంతో ఆగ్నెేస్ పేరు బయటకు వచ్చింది. నైరోబీకి తనను పంపించిన వారు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారని ఆమె చెప్పింది. ఒక్కొక్కరి నుంచి రూ. 40 వేలు తీసుకుంటున్న అగ్నెస్, వారిని కెన్యా, బహ్రెయిన్, దుబాయ్ తదితర దేశాలకు పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
వారిచ్చిన సమాచారం మేరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ అగ్నేస్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించింది. కాగా, అగ్నేస్ ఫేస్ బుక్ పేజీలో బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ తో దిగిన ఫోటోలు కనిపించడం గమనార్హం.