priyanka: 'టాక్సీవాలా'లో చేస్తున్నట్టుగా ఇంట్లోవాళ్లకి చెప్పలేదు: ప్రియాంక జవల్కర్

  • ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను 
  • మధ్యలో తీసేస్తారేమోనని భయం 
  • నిదానంగా నమ్మకం కలిగింది  

విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా' రూపొందింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ  సినిమా ద్వారా కథానాయికగా ప్రియాంక జవల్కర్ పరిచయమవుతోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ .. " గీతా ఆర్ట్స్ వారు 'టాక్సీవాలా' సినిమాకి సంబంధించి ఆడిషన్స్ నిర్వహిస్తే వెళ్లాను .. ఆడిషన్స్ లో వాళ్లు నన్ను ఎంపిక చేశారు. పెద్ద బ్యానర్లో  అవకాశం రావడంతో, ఆ నిజాన్ని నేనే నమ్మలేకపోయాను.

మధ్యలో తీసేసే అవకాశం కూడా ఉందనే అనుమానం కలిగింది. అందువలన 'టాక్సీవాలా' షూటింగులో పాల్గొంటున్నా, ఆ విషయాన్ని మా ఇంట్లో గానీ .. మా స్నేహితులకు గాని వెంటనే చెప్పలేదు. ఇక నన్ను తీసేయరు అనే నమ్మకం కలిగిన తరువాతనే అందరికీ చెప్పాను. ఈ సినిమా తరువాత తనకి అవకాశాలు బాగానే వస్తాయనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.         

More Telugu News