రాఫెల్ వివాదంపై నేడు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ
- కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ధరలను పరిశీలించనున్న న్యాయమూర్తులు
- విపక్షాల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్న కోర్టు
- కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు డిమాండ్
ఈ ఒప్పందానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ధరల వివరాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి, న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం పరిశీలించనుంది. విపక్షాల నుంచి స్పందనలను స్వీకరించనుంది. ఈ వివాదాస్పద ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న డిమాండ్ నేపథ్యంలో కోర్టు విచారణ కీలకం కానుంది.