'ఫ్రెష్ ఎయిర్... ఫ్రెష్ ఎయిర్'... గాలిని కూడా అమ్మేస్తున్నారు!
- న్యూఢిల్లీలో తాజా గాలి వ్యాపారం
- ఆన్ లైన్ లోనూ లభిస్తున్న ఫ్రెష్ ఎయిర్
- రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా సంస్థ
ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ 7.5 లీటర్ల గాలిని రూ. 1,499కి విక్రయిస్తుండగా, హిమాలయాల నుంచి తెచ్చిన గాలి... అంటూ ఉత్తరాఖండ్ కు చెందిన ఓ కంపెనీ 160 సార్లు పీల్చుకునే గాలిని రూ. 550కి అమ్ముతోంది. ఈ గాలిని కొనుగోలు చేస్తే, బాటిల్ తో పాటు, ఓ మాస్క్ మాదిరిగా ఉండే పంపు కూడా లభిస్తుంది. దీన్ని ముఖానికి అమర్చుకుని బటన్ పుష్ చేస్తే, స్ప్రే మాదిరిగా తాజా గాలి, ముక్కుకు అందుతుంది. ఇప్పుడు ఢిల్లీలో ఈ గాలి వ్యాపారం చాలా జోరుగా సాగుతోంది. అదండీ సంగతి!