పుట్టపర్తిలో సాయిబాబా ఫొటో నుంచి రాలుతున్న విభూది!

  • పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రిలో విచిత్రం
  • ఉదయం 4 గంటల నుంచి రాలుతున్న విభూది
  • బారులు తీరుతున్న భక్తులు
పుట్టపర్తి సాయిబాబా ఫొటో నుంచి విభూది రాలుతోందన్న ప్రచారంతో... దాన్ని చూసేందుకు జనాలు పోటెత్తుతున్నారు. ఫొటో నుంచి రాలుతున్న విభూదిని నుదిట రాసుకుని వెళ్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఆసుపత్రిలో ఈ విచిత్రం చోటు చేసుకుంది.

ఆసుపత్రి మెయిన్ గేటుకు సమీపంలోని సేవాదళ్ గదిలో గోడపై ఉంచిన సాయిబాబా ఫొటో నుంచి విభూది రాలుతోంది. దీన్ని గమనించిన సేవాదళ్ సభ్యులు ఫొటోకు పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు ఫొటోను దర్శించుకుని, విభూదిని తీసుకెళుతున్నారు. కొంతమంది విభూది రాలుతున్న వీడియోలను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఇదంతా బాబా మహిమే అని సేవాదళ్ సభ్యులు అంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి విభూది రాలుతోందని చెప్పారు.
Go Back to Shorts
puttaparthi
photo
vibhudi
saibaba

More Telugu News